Mon Feb 02 2026 21:45:49 GMT+0000 (Coordinated Universal Time)
మరో స్కాంలో బాబు సర్కార్

తెలుగుదేశం పార్టీ అవినీతిని జాతీయ స్థాయిలో ఎండగట్టాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నీరు-చెట్టు పనుల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై కేంద్ర విజెలెన్సు శాఖకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మరో అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారుల అకౌంట్లలో యాభై మూడు వేల కోట్ల రూపాయలు వేసిందని సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పర్సనల్ అకౌంట్లను తెరచి, అందులో ఈ డబ్బులు వేశారని, ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందని ధ్వజమెత్తారు. టీడీపీ పర్సనల్ అకౌంట్ల స్కామ్ ను త్వరలోనే బయటపెడతామని ఆయన చెప్పడం విశేషం.
Next Story
