Mon Mar 16 2026 05:13:48 GMT+0530 (India Standard Time)
5గురు ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు గైర్హాజరు
టీడీపీ శాసనసభ పక్ష సమావేశం జరుగుతోంది. అయితే ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, భవాని, వేగుళ్ల జోగేశ్వరరావులు హాజరుకాలేదు. వీరంతా [more]
టీడీపీ శాసనసభ పక్ష సమావేశం జరుగుతోంది. అయితే ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, భవాని, వేగుళ్ల జోగేశ్వరరావులు హాజరుకాలేదు. వీరంతా [more]

టీడీపీ శాసనసభ పక్ష సమావేశం జరుగుతోంది. అయితే ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, భవాని, వేగుళ్ల జోగేశ్వరరావులు హాజరుకాలేదు. వీరంతా వ్యక్తిగత కారణాలవల్లనే హాజరు కాలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే 32 మంది ఎమ్మెల్సీలలో 12 మంది ఎమ్మెల్సీలు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీలను అధికార పార్టీ ప్రలోభ పెడుతుందని టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఆరోపించారు. ఇప్పటికే విప్ జారీ చేశామని, 21వ తేదీన జరగనున్న మండలి సమావేశానికి అందరూ హాజరవుతారని ఆయన తెలిపారు. టీడీఎల్పీ సమావేశం కొనసాగుతుంది.
Next Story