Sat Mar 28 2026 07:23:08 GMT+0530 (India Standard Time)
యూఎస్ క్రికెట్ లో డామినేషన్ మనోళ్లదే
టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన అండర్ 19 జట్టు యూఎస్ క్రికెట్లో తెలుగు అమ్మాయిలు ఆధిపత్యం చెలాయించారు

అమెరికా క్రికెట్ అండర్ 19 జట్టును ప్రకటించారు. అయితే ఇక్కడ విశేషమేంటంటే ప్రకటించిన పదిహేను మంది ఆటగాళ్లలో ఎక్కువ మంది తెలుగు అమ్మాయిలే కావడం విశేషం. కెప్టెన్ కొడాలి గీతిక అమెరికా అండర్ 19 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ జట్టుకు ఒక తెలుగు యువతి కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. వచ్చే నెలలో ఐసీసీ అండర్ 19 మహిళల టీ 20 ప్రపంచ్ కప్ జరగనుంది.
అందర్ 19 జట్టులో...
అయితే తాజాగా ప్రకటించిన జట్టులో కెప్టెన్ గా కొడాలి గీతిక వ్యవహరించనున్నారు. వైస్ కెప్టెన్ గా అనికా కోలన్ ఉంటారు. సభ్యులుగా ఆదితి, భూమిక భద్రిరాజు, దిశ థింగ్రా, ఇషానీ వఘేలా, లాస్య ముళ్లపూడి, పూజా గణేష్, పూజా షా, రీతూ సింగ్, సాయి తన్మయి, సిగ్ధ్న పౌల్, సుహానీ తడాని, తరనమ్ చోప్రా, జీవన లు ఉన్నారు. వీరిలో అత్యధిక మంది తెలుగు వారే కావడం గమనార్హం. రిజర్వ్డ్ ప్లేయర్లుగా చేతన ప్రసాద్, కస్తూరి వేదాంతంలు ఉన్నారు. యూఎస్ క్రికెట్ జట్టులో తెలుగు అమ్మాయిలు ఆధిపత్యం వహించడం రెండు రాష్ట్రాలకు గర్వకారణంగానే చూడాలి.
దక్షిణాఫ్రికాలో జరిగే....
పదిహేను మందిని ఎంపిక చేసిన ఈ జట్టుకు కోచింగ్ టీమ్ గా శివనారాయణ్ చంద్రపాల్ నాయకత్వం వహిస్తున్నారు. యూఎస్ జట్టు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లతో ఏ గ్రూపులో ఆడనుంది. ఈ పోటీల్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు పాల్గొంటాయి. యూఎస్ లోని తమ జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉందని యూఎస్ఏ క్రికెట్ బోర్డు మెంబర్ నదియా గ్రునీ తెలిపారు. సవాళ్లను అధిగమించి తమ జట్టు అత్యుత్తమంగా రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

