Fri Dec 05 2025 10:54:02 GMT+0000 (Coordinated Universal Time)
బాబు.. పవన్ భేటీ మరికాసేపట్లో
మరికాసేపట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అవుతున్నారు

మరికాసేపట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అవుతున్నారు. హైదరాబాద్ లో ఈ భేటీ జరగనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నెంబరు 1పై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. చంద్రబాబు కుప్పం పర్యటనలోనూ పోలీసులు అనుసరించిన వైఖరిపై ఇద్దరూ చర్చించనున్నారు. న్యాయపరంగా ఎలా ఎదుర్కొనాలన్నదానిపై చర్చిస్తారు.
12న జనసేన సభకు...
దీంతో పాటు ఈ నెల 12న జనసేన ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో యువశక్తి కార్యక్రమం జరగనుంది. అనేక ఆంక్షల మధ్య పోలీసులు సమావేశానికి అనుమతి ఇచ్చారు. పవన్ బస్సుయాత్ర, లోకేష్ పాదయాత్రలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇద్దరి మధ్య చర్చ జరుగుతుందని తెలిసింది. ముందస్తు ఎన్నికలు వస్తాయనుకుంటున్న నేపథ్యంలో ఈ చర్చకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

