Tue Mar 24 2026 13:46:15 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: టీఆర్ఎస్ నేత దారుణ హత్య

వికారాబాద్ జిల్లా ఫిరంగిపురం సుల్తాన్ పూర్ లో టీఆర్ఎస్ నేత దారుణహత్యకు గురయ్యారు. టీఆర్ఎస్ నేత ఫిరంగి నారాయణరెడ్డి ని ప్రత్యర్థులు చంపేశారు. నిన్న కాంగ్రెస్ వర్గాలకు, టీఆర్ఎస్ వర్గాలకు ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. నారాయణరెడ్డిపై రాళ్లతో దాడి చేసి కత్తులతో నరికి చంపారు. ఇది రాజకీయ హత్యేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సుల్తాన్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడులకు పాల్పడిన వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఈ హత్య సంచలనం రేపింది. హత్య జరగడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి దాడికి దిగారు.
Next Story

