Sat Dec 06 2025 12:23:14 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ రాజకీయంలో విషాదం.. అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ కన్నుమూత
మందాడి సత్యనారాయణ రెడ్డి బీజేపీతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎదిగారు. తెలంగాణ

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత మందాడి సత్యనారాయణ రెడ్డి ఆదివారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 2004 ఎన్నికల్లో హన్మకొండ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో హన్మకొండ నియోజకవర్గం రద్దై పోయింది. 2009 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ను వీడి.. కాంగ్రెస్ లో చేరారు.
మందాడి సత్యనారాయణ రెడ్డి బీజేపీతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీని వీడిన ఆయన టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. మందాడి సత్యనారాయణ మృతి పట్ల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తదితరులు సంతాపం ప్రకటించారు. మందాడి మృతిపట్ల బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు.
Next Story

