Sun Mar 08 2026 13:49:40 GMT+0530 (India Standard Time)
జారిపడిన కేటీఆర్..కాలికి గాయం
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు జారి పడ్డారు. దీంతో ఆయన ఎడమ కాలి మడమకు తీవ్రగాయమయింది. వెంటనే పరీక్షలు చేయించుకున్నారు

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు జారి పడ్డారు. దీంతో ఆయన ఎడమ కాలి మడమకు తీవ్రగాయమయింది. వెంటనే పరీక్షలు చేయించుకున్నారు. ఎడమ కాలి మడమకు గాయమయినందున మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో తెలిపారు. ఎడమ కాలి మడమకు చిన్నపాటి ఫ్రాక్చర్ కావడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని ట్వీట్ చేశారు.
రేపు పుట్టిన రోజు....
కాగా తనకు ఈ మూడు వారాల పాటు ఓటీటీలో మంచి సినిమాలు చూసేందుకు పేర్లు సూచించాలని కేటీఆర్ నెటిజన్లను కోరారు. కాగా రేపు మంత్రి కేటీఆర్ పుట్టినరోజు. ఆయన తన పుట్టిన రోజు వేడుకలకు హంగామా చేయవద్దని సూచించారు. తనపై అభిమానమున్న వారు వరద బాధితులను ఆదుకోవాలని సూచించారు. వరద బాధితులకు సాయం చేసి వారిని ఆదుకుంటే అదే తనకు ఆనందమని కేటీఆర్ చెప్పారు.
Next Story

