Wed Jun 07 2023 19:08:52 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై మంత్రి కేటీఆర్ పొగడ్తలు
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పొగడ్తలతో ముంచెత్తారు

తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పొగడ్తలతో ముంచెత్తారు. హిందూ పత్రిక సంపాదకీయ బృందంతో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కష్టమైన సమయంలో ఆంధ్రప్రదేశ్ ను వైఎస్ జగన్ చక్కగా పరిపాలించారని అన్నారు. తన సోదర సమానుడైన జగన్ ను ఆయన అన్ని రకాలుగా సమర్థించారు.
కోవిడ్ సమయంలో...
ప్రధానంగా కోవిడ్ సమయంలో జగన్ పనితీరును ఆయన ప్రశంసిించారు. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తినా జగన్ పేదలకు పథకాలను అందించడంలో సఫలమయ్యారని మంత్రి కేటీఆర్ అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన కొన్ని నెలలకే కోవిడ్ మహమ్మారి విజృంభించిందని అయినా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పారని మంత్రి కేటీఆర్ కితాబిచ్చారు.
సంక్షేమ పథకాలు...
జగన్ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిందన్న విమర్శలను మంత్రి కేటీఆర్ తోసి పుచ్చారు. ఆ విమర్శలన్నీ ప్రజలను తప్పుదోవపట్టించడానికేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఖజానా ఉత్తర్ ప్రదేశ్ కంటే మెరుగ్గా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏపీలో పాలన చక్కగా కొనసాగుతుందని ఆయన అన్నారు.
Next Story