ఉగ్రదాడిలో తెలంగాణ జవాను మృతి
జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో తెలంగాణకు చెందిన జవాన్ మృతి చెందాడు. సోమవారం ఉదయం ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ జవాన్ శ్రీనివాస్ మృతి చెందినట్లుగా సమాచారం. పెద్దపల్లి [more]
జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో తెలంగాణకు చెందిన జవాన్ మృతి చెందాడు. సోమవారం ఉదయం ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ జవాన్ శ్రీనివాస్ మృతి చెందినట్లుగా సమాచారం. పెద్దపల్లి [more]

జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో తెలంగాణకు చెందిన జవాన్ మృతి చెందాడు. సోమవారం ఉదయం ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ జవాన్ శ్రీనివాస్ మృతి చెందినట్లుగా సమాచారం. పెద్దపల్లి లోని రామగిరి మండలం నాగ పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ మృతి చెందినట్లుగా అధికారులు ప్రకటించారు. 2013లో శ్రీనివాస్ సిఆర్పిఎఫ్ లో జవాన్ గా చేరాడు. శ్రీనివాస్ కి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. నిరుపేద కుటుంబం నుంచి శ్రీనివాస్ పైకి వచ్చాడు. తండ్రి పశువుల కాపరి గా జీవనం కొనసాగిస్తున్నాడు. తమ్ముడు కూలిపని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. శ్రీనివాస్ చనిపోయిన విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో శోకసముద్రంలో మునిగిపోయారు.