సీనియర్ ఐఏఎస్ అధికారికి షాకిచ్చిన ప్రభుత్వం
సీనియర్ ఐపీఎస్ అధికారి వికె సింగ్ కి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించినది. రెండు శాఖాపరమైన విచారణ [more]
సీనియర్ ఐపీఎస్ అధికారి వికె సింగ్ కి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించినది. రెండు శాఖాపరమైన విచారణ [more]

సీనియర్ ఐపీఎస్ అధికారి వికె సింగ్ కి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించినది. రెండు శాఖాపరమైన విచారణ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో స్వచ్ఛంద పదవీ విరమణ అనుమతించే ప్రసక్తే లేదంటూ తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది .. అయితే అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి తన స్వచ్ఛంద పదవీ విరమణ అనుమతించాలని జూన్ లో ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకున్నారు. ఈ పిటిషన్ పై సమగ్రంగా పరిశీలించిన తర్వాత, అక్టోబరు రెండో తేదీన ప్రభుత్వం అధికారికంగా సమాధానం ఇచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారి వి.కె.సింగ్ పైన రెండు శాఖాపరమైన దర్యాప్తు ఉన్నాయని, వీటిని ఉన్న సమయంలో స్వచ్ఛంద పదవీ విరమణ అనుమతించే ప్రసక్తే లేదంటూ చెప్పింది.. తాను విఆర్ఎస్ తీసుకున్న తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నానని చెప్పారు. తన డిజిపి ర్యాంకు ఇవ్వకపోతే తన పదవికి రాజీనామా చేస్తానంటూ గతంలోనే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రభుత్వం పైన పలుమార్లు దూషణలకు దిగారు. జూన్ మాసంలో స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీన్ని అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాత వికే సింగ్ కు స్వచ్ఛంద పదవీ విరమణ అనుమతించేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే తదుపరి కార్యాచరణ ఏం చేస్తాడో అనే విషయం ఇప్పటికీ తెలియడం లేదు.

