Sun Aug 07 2022 19:29:05 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: రాహుల్ వచ్చే లోపే జంప్..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. నకిరేకల్ ఎమ్మెల్యే, కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుడు చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ మేరకే ఆయన టీఆర్ఎస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఆయన కాంగ్రెస్ నేతలకు అందుబాటులోకి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే, చిరుమర్తి లింగయ్య పార్టీ మారతాడని టీవీలో చూసి తెలుసుకున్నామని, చిరుమర్తి నమ్మకద్రోహం చేస్తాడని అనుకోలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. రెండుసార్లు టిక్కెట్ ఇప్పించి గెలిపిస్తే తమను సంప్రదించకుండానే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్యకు టక్కెట్ ఇవ్వకపోతే తామూ పోటీ చేయమని చెప్పిన మరీ లింగయ్యకు కోమటిరెడ్డి సోదరులు టిక్కెట్ ఇప్పించిన విషయం తెలిసిందే.
Next Story