Mon Mar 23 2026 23:14:02 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రకటన తేదీ ఇదే

తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులను నవంబరు 1వ తేదీన ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నవంబరు 1వ తేదీనే అభ్యర్ధులను ప్రకటిస్తామని, అదే రోజు మ్యానిఫేస్టోను కూడా విడుదల చేస్తామని ఉత్తమ్ చెప్పారు. ఒకటి రెండు రోజుల్లోనే మ్యానిఫేస్టో తుదిరూపుదిద్దుకుంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పటికే 105 మంది అభ్యర్ధులను ప్రచారంలో ముందుండగా కాంగ్రెస్ మాత్రం పొత్తుల్లో సీట్ల సర్దుబాటులో తలమునకలై ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడుచేసిన ప్రకటన ఆపార్టీనేతల్లో ఆనందం నింపింది. నవంబరు 1న అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత వారు అధికారికంగా ప్రచారంలో ఉంటారని ఆయన చెప్పారు. ఇప్పటికే కొందరు తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు.
Next Story

