Sat Mar 07 2026 13:32:12 GMT+0530 (India Standard Time)
విశ్వనాధ్ కు నిద్రపట్టకుండా చేసిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కె. విశ్వనాధ్ ఇంటికి కాసేపట్లో చేరుకోనున్నారు. ఆయన పార్ధీవ దేహానికి నివాళులర్పించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కె. విశ్వనాధ్ ఇంటికి కాసేపట్లో చేరుకోనున్నారు. ఆయన పార్ధీవ దేహానికి నివాళులర్పించనున్నారు. కె.విశ్వనాధ్ సినిమాలంటే ఇష్టపడని వారుండరు. అందులో కేసీఆర్ ఒకరు. ఆయన సినిమాను చూసి భావోద్వేగానికి గురై కొంతకాలం క్రితం విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయనను ఘనంగా సత్కరించి వచ్చారు. స్వర్ణకమలంలో పాటలను చూసి ముగ్గుడై ఆయనను స్వయంగా కలవాలనుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి తన ఇంటికి వస్తున్నాడని తెలిసిన వెంటనే విశ్వనాధ్ కొంత కలవరపడ్డారట. అప్పటికే సినిమాలకు స్వస్తి చెప్పి విశ్రాంతి తీసుకుంటున్నారు విశ్వనాధ్.
ఎందుకు వస్తున్నారో తెలియక...
ఆయన ఎందుకు వస్తున్నారో అర్థంకాక రాత్రంతా నిద్రపట్టలేదట. ఫోన్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారా? లేక ఏదైనా ఫేక్ కాలా? అని రాత్రంతా నిద్రపోకుండా గడిపారట. అయితే ఉదయాన్నే ఇంటివద్ద సెక్యూరిటీ హడావిడి చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారని నిర్ధారించుకున్నానని కె. విశ్వనాధ్ ఒక సన్మాన కార్యక్రమంలో చెప్పారట. అలా విశ్వనాధ్ ను ప్రత్యేకంగా గౌరవించిన కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్లి ఘనంగా నివాళులర్పించనున్నారు. పంజాగుట్ట శ్మశానవాటికలో విశ్వనాథ్ పార్ధీవదేహానికి సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
- Tags
- kcr
- k.viswanadh
Next Story

