Sat Jan 31 2026 00:22:52 GMT+0000 (Coordinated Universal Time)
ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్.. ఆయనను కేబినెట్ లోకి...?
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి కేసీఆర్ ట్విస్ట్ ఇచ్చేటట్లే కనపడుతుంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి కేసీఆర్ ట్విస్ట్ ఇచ్చేటట్లే కనపడుతుంది. రాజ్యసభ పదవి ఉన్న బండ ప్రకాష్ ను ఎమ్మెల్సీ చేసే ఛాన్స్ కనపడుతుంది. ఎమ్మెల్సీని చేసి ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. బండ ప్రకాష్ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నేత. ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
ఈటల స్థానంలో....
ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి తప్పించడంతో ఆయన స్థానంలో బండ ప్రకాష్ ను కేసీఆర్ కేబినెట్ లోకి తీసుకునే అవకాశముంది. ఆయన ఇప్పటికే ప్రగతి భవన్ కు చేకుకుని కేసీఆర్ తో చర్చించారు. ఎమ్మెల్యే కోటాలో టఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారరయ్యాయి. మొత్తం ఆరుగురిని ఈ పదవులకు కేసీఆర్ ఎంపిక చేశారు.వీరంతా అసెంబ్లీకి చేరుకుని నామినేషన్ వేయనున్నారు.
వీరే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు
1. పాడె కౌశిక్ రెడ్డి
2. కడియం శ్రీహరి
3. బండ ప్రకాష్
4. గుత్తా సుఖేందర్ రెడ్డి
5. తక్కెళ్ల పల్లి రవీందర్ రావు
6. మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి
Next Story

