ఆపరేషన్ కొలిక్కి వస్తోంది… గ్యాస్ లీక్ కు కారణాలపైనే?
ముంబయి, నాగపూర్, పూనే నిపుణుల బృందం విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాప్ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నిస్తుంది. గ్యాస్ లీకేజీకి గల కారణాలను కూడా ఈ బృందం పరిశీలిస్తుంది. స్టెరిన్ [more]
ముంబయి, నాగపూర్, పూనే నిపుణుల బృందం విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాప్ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నిస్తుంది. గ్యాస్ లీకేజీకి గల కారణాలను కూడా ఈ బృందం పరిశీలిస్తుంది. స్టెరిన్ [more]
ముంబయి, నాగపూర్, పూనే నిపుణుల బృందం విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాప్ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నిస్తుంది. గ్యాస్ లీకేజీకి గల కారణాలను కూడా ఈ బృందం పరిశీలిస్తుంది. స్టెరిన్ ట్యాంక్ లో ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నంలో నిపుణుల బృందం ఉంది. ఎల్జీ పాలిమర్స్ పరిసర ప్రాంతాల ప్రజలను ఎవరినీ ఇంకా గ్రామాల్లోకి అనుమతించడం లేదు. వారంతా బంధువులు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాల్లోనే ఉంటున్నారు. విషవాయువు ప్రభావాన్ని తగ్గించేందుకు నిపుణుల బృందం ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక రసాయనాలను ఉపయోగిస్తుంది. మరికొద్ది గంటల్లో సాధారణ స్థితికి చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం 9 మందది నిపుణుల బృందం విషవాయువును నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.