Thu Mar 19 2026 03:58:14 GMT+0530 (India Standard Time)
జూనియర్ తో టీం ఇండియా క్రికెటర్లు
టీం ఇండియా క్రికెటర్లు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. నజీర్ ఇంట్లో వీరంతా సమవేశమయ్యారు

టీం ఇండియా క్రికెటర్లు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. నజీర్ ఖాన్ ఇంట్లో వీరంతా సమవేశమయ్యారు. నజీర్ ఖాన్ ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితుడు. అలాగే టీం ఇండియాలో అనేక మంది క్రికెటర్లతో ఆయన సన్నిహితంగా ఉంటారు. న్యూజిలాండ్ తో రేపు జరిగే వన్డే మ్యాచ్ కోసం హైదరాబాద్ కు చేరుకున్న క్రికెటర్లు జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు.
విందుకు హాజరైన...
నిన్న రాత్రి ఇర్ఫాన్ ఇంట్లో టీం ఇండియా క్రికెటర్లు జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. వారితో కలసి డిన్నర్ చేసినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR మూవీ దేశ వ్యాప్తంగా హిట్ కావడంతో ఆయనను క్రికెటర్లు కలిసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి సూర్యకుమార్ యాదవ్, చాహల్, ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, శార్దూల్ లు కలశారు. వారితో కలసి జూనియర్ ఎన్టీఆర్ సరదాగా కొద్దిసేపు గడిపారు.
Next Story

