Tue Mar 24 2026 08:56:03 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో టీడీపీ ఎంపీల అరెస్ట్

టీడీపీ ఎంపీలు ప్రధానమంత్రి ఇంటి ముట్టడికి దిగారు. ఈరోజు మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి నివాసంలో సమావేశమైన ఎంపీలు కార్యాచరణను రూపొందించుకున్నారు. ఏపీ విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా సాధన కోసం ప్రధాని ఇంటిని ముట్టడించాలని నిర్ణయించారు. ఈమేరకు ప్రధాని నివాసం వద్దకు బయలుదేరగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎంపీల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. ఎంపీలు మాగంటి బాబు, దివాకర్ రెడ్డి, సీఎం రమేష్, మురళీ మోహన్, సుజనా చౌదరి, తోట నరసింహం, బుట్టా రేణుక తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story

