Tue Mar 24 2026 07:31:20 GMT+0530 (India Standard Time)
టీడీపీ ఎంపీలు దూకుడు పెంచారు

ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం ఢిల్లీలో టీడీపీ పార్లమెంటు సభ్యుల ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న ప్రధాని ఇంటి ముట్టడికి ప్రయత్నించిన ఎంపీలు ఈరోజు రాజ్ ఘాట్ వద్ద నిరసన తెలుపుతున్నారు. మౌనదీక్ష చేపట్టారు. టీడీపీ లోక్ సభ నేత తోట నరసింహం ఇంటిలో సమావేశమైన టీడీపీ ఎంపీలు ఈ మేరకు కార్యాచరణను రూపొందించుకున్నారు. నిన్న ధర్నాలతో దద్దరిల్లించిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలసిందే. వారిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించి సంఘీభావం తెలిపారు. కాగా నిన్న టీడీపీ ఎంపీల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీలను పెద్దవారిని కూడా చూడకుండా పోలీసులు లాగి పడేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కేంద్రం తీరు అప్రజాస్వామిక మని చంద్రబాబు అన్నారు.
Next Story

