Tue Mar 24 2026 13:40:24 GMT+0530 (India Standard Time)
టీడీపీ ఎంపీలు బోల్తా పడ్డారే

టీడీపీ ఎంపీలు బోల్తా పడ్డారు. ఈరోజు సభ నిరవధిక వాయిదా పడిన వెంటనే లోక్ సభలోనే ఉండి నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా సభ వాయిదా పడిన తర్వాత లోక్ సభలోనే ఉండి నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే కొద్ది సేపటి తర్వాత అక్కడకు వచ్చిన భద్రతాసిబ్బంది స్పీకర్ మాట్లాడేందుకు రమ్మంటున్నారని టీడీపీ ఎంపీలను పిలిచారు. అత్యవసరంగా మాట్లాడాలని స్పీకర్ కబురు పంపారని తెలియజేయడంతో టీడీపీ ఎంపీలందరూ స్పీకర్ కార్యాలయానికి వెళ్లగానే సిబ్బంది లోక్ సభ తలుపులు మూసేశారు. స్పీకర్ కూడా కార్యాలయంలో లేకపోవడంతో ఆగ్రహించిన టీడీపీ ఎంపీలు అక్కడే బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు.
Next Story

