Sat Mar 07 2026 15:55:45 GMT+0530 (India Standard Time)
మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపై సీబీఐ విచారణ చేయించాలి
దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపై పలు అనుమానాలున్నాయంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆ అనుమానాలు నివృత్తి కావాలంటే..

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నిన్న ఉదయం తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులతో పాటు.. అభిమానులను కూడా తీవ్రంగా కలచివేసింది. గౌతమ్ రెడ్డి మృతిపై సోషల్ మీడియాలో పలు రూమర్లు రాగా.. వాటన్నింటినీ కుటుంబ సభ్యులు ఖండించారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ గౌతమ్ రెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు.
దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపై పలు అనుమానాలున్నాయంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆ అనుమానాలు నివృత్తి కావాలంటే గౌతమ్ రెడ్డి మృతిపై సీబీఐతో విచారణ చేయించాలని బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా.. ప్రస్తుతం గౌతమ్ రెడ్డి భౌతిక కాయం నెల్లూరులోని స్వగృహం వద్ద అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. రేపు ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
Next Story

