Wed Mar 18 2026 08:19:30 GMT+0530 (India Standard Time)
రాధాతో వంశీ భేటీ.. అందుకేనా?
తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధా ను టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు.

తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధా ను టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. మర్యాదపూర్వకంగానే వీరిద్దరూ భేటీ అయినట్లు తెలిసింది. అయితే వీరిద్దరూ కలసి వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంగవీటి రాధా కార్యాలయానికి వెళ్లి మరీ వల్లభనేని వంశీ కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
వైసీపీలోకి....
వంగవీటి రాధాను తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వల్లభనేని వంశీ, కొడాలి నాని, వంగవీటి రాధా మంచి మిత్రులు. రాజకీయంగా వీరు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కడ ఫంక్షన్ లో కలిసినా ఆత్మీయంగా పలకరించుకుంటారు. కానీ ప్రత్యేకంగా రాధా కార్యాలయానికి వెళ్లి వల్లభనేని వంశీ కలవడం చర్చనీయాంశమైంది.
Next Story

