Tue Mar 24 2026 07:30:32 GMT+0530 (India Standard Time)
తిరుగు ప్రయాణంలో టీడీపీ ఎంపీలు

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ఢిల్లీ నుంచి ఇళ్లకు బయలుదేరారు. ఢిల్లీ నుంచి గల్లీకి పోరాటాన్ని మార్చాలని నిర్ణయించారు. తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజలతో సమావేశమై చర్చించి ప్రత్యేక హోదా సాధన కోసం ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఢిల్లీలో ఈరోజు రాజ్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రతిజ్ఞ చేసిన ఎంపీలు రాష్ట్రానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఇక్కడికి వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు.
Next Story

