Sun Mar 22 2026 20:21:36 GMT+0530 (India Standard Time)
మంత్రి కాల్వ అవినీతి చిట్టా ఉంది

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ముదురుతోంది. హైదరాబాద్ లో భూకబ్జాల ఆరోపణలు ఎదుర్కొని సస్పెండైన దీపక్ రెడ్డి, మంత్రి కాల్వ శ్రీనివాసులుకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీతో దీపక్ రెడ్డికి సంబంధం లేదు అని మంత్రి చెప్పడాన్ని దీపక్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో తన మద్దతుతో గెలిచి ఇప్పుడు తననే విమర్శిస్తారా అని ఆయన కాల్వపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీ ఎమ్మెల్సీ కాదని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. మంత్రి కాల్వ అవినీతి, అక్రమాల చిట్టా మొత్తం తనవద్ద ఉందని, సమయం వచ్చినప్పుడు వాటిని భయటపెడతానని ఆయన స్పష్టం చేశారు. మంత్రి కాల్వకు ఇదే తన లాస్ట్ వార్నింగ్ అని దీపక్ రెడ్డి హెచ్చరించారు.
Next Story

