Sun Mar 15 2026 19:19:49 GMT+0530 (India Standard Time)
వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే
కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ లోటస్ పాండ్ లో ఆయన తన అనుచరులతో కలిసి [more]
కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ లోటస్ పాండ్ లో ఆయన తన అనుచరులతో కలిసి [more]

కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ లోటస్ పాండ్ లో ఆయన తన అనుచరులతో కలిసి పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రాజంపేట నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున ఆయన అనుచరులు వైసీపీలో చేరారు. మేడా సోదరులు రఘునాథరెడ్డి, సుధాకర్ రెడ్డి కూడా పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో కడప జిల్లా నుంచి టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. ప్రభుత్వ విప్ గా కూడా పనిచేశారు. ఇటీవలే ఆయన టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే, విప్ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Next Story