Mon Mar 16 2026 03:51:44 GMT+0530 (India Standard Time)
గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. రహస్య జీవోల పై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. జీవోలను ప్రజలకు అందుబాటులో [more]
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. రహస్య జీవోల పై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. జీవోలను ప్రజలకు అందుబాటులో [more]

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. రహస్య జీవోల పై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. జీవోలు ఆన్ లైన్ లో ఉంచకుండా ప్రజలను మోసగించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తుందని వారు ఆరోపించారు. అర్థరాత్రి జీవోలు విడుదల చేస్తూ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని వారు గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. గవర్నర్ ను కలసిన వారిలో వర్ల రామయ్య, బోండా ఉమలు ఉన్నారు.
Next Story