Fri Mar 20 2026 18:48:28 GMT+0530 (India Standard Time)
వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు
కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న ఇరిగెల సోదరులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో [more]
కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న ఇరిగెల సోదరులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో [more]

కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న ఇరిగెల సోదరులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఇరిగెల రాంపుల్లారెడ్డి, ఆయన సోదరులు వైసీపీలో చేరారు. టీడీపీ హయాంలో అవినీతి పెరిగిపోయిందని రాంపుల్లారెడ్డి పేర్కొన్నారు. తమకు వ్యక్తిగతంగా ఎవరితోనే విభేదాలు లేవని, పార్టీ ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలో సైనికులుగా పనిచేయడానికి సిద్ధమై పార్టీలో చేరామన్నారు.
Next Story