Mon Feb 02 2026 03:43:54 GMT+0000 (Coordinated Universal Time)
మేం టీడీపీ వాళ్లం...మమ్మల్నే ఫీజు కట్టమంటారా..

పోలవరం యాత్రకు వెళుతున్న తెలుగుదేశం పార్టీ నేతలు టోల్ గేట్ వద్ద హల్ చల్ చేసి దాడికి దిగారు. పోలవరం వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద సిబ్బంది ఆపి టోల్ ఫీజు కట్టాలని కోరారు. దీంతో ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు తాము టీడీపీ వాళ్లమని మమ్మల్నే టోల్ ఫీజు కట్టమంటారా అని బండబూతులు తిట్టారు. అంతటితో ఆగకుండా బస్సు దిగి టోల్ బూత్ అద్దాలను ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేవలం సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు పెట్టే యోచనలో ఉన్నారు.
Next Story

