Sun Mar 15 2026 11:03:56 GMT+0530 (India Standard Time)
మాజీ మంత్రులను కిందకు లాగి పడేశారు
టీడీపీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. గుంటూరులో రమ్య నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రమ్య నివాసానికి వెళ్లిన [more]
టీడీపీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. గుంటూరులో రమ్య నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రమ్య నివాసానికి వెళ్లిన [more]

టీడీపీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. గుంటూరులో రమ్య నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రమ్య నివాసానికి వెళ్లిన టీడీపీ నేతలను పోలీసులు పక్కకు లాగేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పై పోలీసు ఉన్నతాధికారి చేయి చేసుకున్నారు. దూళిపాళ్ల నరేంద్రను లారీలోకి లాగి పడేశారు. ఈ తోపులాటలో మాజీ మంత్రి ఆలపాటి రాజుేంద్ర ప్రసాద్ కిందపడిపోయారు. వైసీపీ నేతలు రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారని తెలిసి పోలీసులు టీడీపీ నేతలను లాగి పడేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story