Wed Mar 25 2026 13:44:40 GMT+0530 (India Standard Time)
వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ వరుస సెటైర్లు
కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టుగా ఉంది జగన్ మోసపు రెడ్డి అమ్మ ఒడి పధకం తీరు ..

అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం ప్రస్తుత అమలు తీరుపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు సంధించారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టుగా ఉంది జగన్ మోసపు రెడ్డి అమ్మ ఒడి పధకం తీరు అంటూ లోకేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
"తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 కోత పెట్టి అర్ద ఒడిగా మారిన పథకంపై ఇప్పుడు ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి.. పథకం మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేసారు.300 యూనిట్లు దాటి కరెంట్ వాడితే కట్, ప్రతి విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి, ఆధార్లో కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలి, కొత్త బియ్యం కార్డు ఉంటేనే అమ్మఒడి లాంటి కండిషన్స్ అప్ప్లై అని ముందే ఎందుకు చెప్పలేదు జగన్ మోసపు రెడ్డి గారు? మీ సతీమణి గారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు వేస్తామని ఇచ్చిన హామీని కూడా గంగలో కలిపేసారు. అమ్మలని మానసిక క్షోభకి గురిచేసే ఈ ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మ ఒడి ఇవ్వాలి." అని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
Next Story

