Thu Jan 29 2026 22:24:17 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఉండరట.. కర్ణాటక వెళతారట
మూడు రాజధానుల అంశం ఏపీలో రగడ సృష్టిస్తుంటే టీడీపీ నేత కొొత్త వాదనను తెరపైకి తెచ్చారు. మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి తిక్కారెడ్డి తమ నియోజకవర్గాన్ని [more]
మూడు రాజధానుల అంశం ఏపీలో రగడ సృష్టిస్తుంటే టీడీపీ నేత కొొత్త వాదనను తెరపైకి తెచ్చారు. మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి తిక్కారెడ్డి తమ నియోజకవర్గాన్ని [more]

మూడు రాజధానుల అంశం ఏపీలో రగడ సృష్టిస్తుంటే టీడీపీ నేత కొొత్త వాదనను తెరపైకి తెచ్చారు. మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి తిక్కారెడ్డి తమ నియోజకవర్గాన్ని కర్ణాటకలో కలిపేయాలని కోరారు. తాము విశాఖ రాజధానికి వెళ్లాలంటే ఒక రోజు సమయం పడుతుందని, కర్ణాటక అయితే తమకు దగ్గరని తెలిపారు. గతంలో మంత్రాలయం ప్రాంతం కర్ణాటకలో ఉండేదని ఆయన గుర్తు చేశారు. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన అర్థం లేదని ఆయన కొట్టిపారేశారు. మంత్రాలయం ప్రాంతంలో ఇప్పటికీ కర్ణాటక సంస్కృతి ఉందని, తాము విశాఖ వెళ్లలేమని కర్ణాటకలో కలిపేయమని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో దీనిపై ఉద్యమిస్తామని ఆయన చెప్పారు.
Next Story