Tue Mar 24 2026 02:06:15 GMT+0530 (India Standard Time)
జగన్ కుటుంబంపై ఎమ్మెల్సీ దారుణ వ్యాఖ్యలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ కుటుంబంలో అనేక విభేదాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విజయమ్మను, షర్మిలను జగన్ అణగదొక్కుతున్నారని అన్నారు. జగన్ కుటుంబసభ్యులే ఆయనపై హత్యాయత్నం చేసి ఉండొచ్చని అనుమానం ఉందన్నారు. సానుభూతితో గట్టెక్కాలని జగన్ కుటుంబసభ్యులు కుట్ర చేశారని, జగన్ ఫోటో పెట్టుకుని ఓట్లు దండుకోవాలని అనుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Next Story

