Tue Mar 24 2026 12:08:43 GMT+0530 (India Standard Time)
అలా జరిగితే హరీష్ రావే సీఎం

టీఆర్ఎస్, ప్రజా కూటమికి సమానంగా సీట్లు వస్తే టీఆర్ఎస్ లోని కొందరిని తీసుకుని హరీష్ రావు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో అంతర్యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోందని, హరీష్ రావు అసలు సిసలైన రాజకీయ నాయకుడన్నారు. హరీష్ రావు టీఆర్ఎస్ లో ఇమడలేకపోతున్నారని, ఎప్పటికైనా టీఆర్ఎస్ చీలిపోవడం ఖాయమని పేర్కొన్నారు. వైఎస్ బతికుంటే హరీష్ రావు కాంగ్రెస్ లో ఎప్పుడో చేరేవారని, ఇప్పుడు సరైన సమయం కోసం హరీష్ రావు ఎదురుచూస్తున్నారని అన్నారు. కేసీఆర్ అభద్రతాభావంలో ఉన్నారని, కొడుకు, కూతురికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.
Next Story

