Tue Mar 24 2026 05:08:16 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ తో పొత్తుపై ఏపీ టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ సహా ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక కూటమికి చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించాలని జాతీయ స్థాయి నేతలు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. మాయవతి, అఖిలేష్ యాదవ్ తో ఇప్పటికే ముఖ్యమంత్రి కలిశారని, కాంగ్రెస్ తో కలిసి బీజేపీపై పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
Next Story

