Thu Mar 19 2026 00:11:22 GMT+0530 (India Standard Time)
జగన్ తప్పు చేసి..!

వై.ఎస్. భారతి పేరును ఈడీ ఛార్జ్ షీట్ లో చేర్చడంపై మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈడీ వేసిన ఛార్జ్ షీట్ తో మాకేం సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో ఆయన కుటుంబ ప్రమేయం ఉందో లేదో జగనే చెప్పాలన్నారు. జగన్ వైఖరితో ఆయన కుటుంబం కూడా ఇబ్బందులు పడుతుందని యనమల పేర్కొన్నారు. కేవలం సానుభూతి పొందేందుకే జగన్ లేఖ రాశారు కానీ, ఎక్కడా తాను తప్పు చేయలేదని చెప్పలేదన్నారు. ప్రతికలకు ఉండే సమాచార వ్యవస్థ వల్లే వారు ఈ వార్తలను ప్రచురించారని స్పష్టం చేశారు.
Next Story

