Mon Feb 02 2026 04:58:06 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీలో అంతర్మథనం

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...టీడీపీ ఢిల్లీలో పోరాడుతుంటే... వైసీపీ గల్లీలో పోరాడుతుందన్నారు. శాసనాలు చేయాల్సిన ఎంపీలను ఇళ్లకు పరిమితం చేశారని, ఎమ్మెల్యేలను రోడ్ల వెంట తిప్పుతున్నారని విమర్శించారు. జగన్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం ప్రారంభమైందని పేర్కొన్నారు. జగన్ కు పోరాడే శక్తి లేదు...కనీసం వార్డు మెంబర్ కు ఉన్న ఆలోచనా శక్తి కూడా ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. సీఎం సీట్లో వేరే వాళ్లు కూర్చుంటే చూడలేని ఫోబియా జగన్ కు ఉందన్నారు.
Next Story

