Fri Dec 05 2025 15:47:10 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : చంద్రబాబుకు హైకోర్టు షరతులు
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పై అదనపు షరతులపై తీర్పు వచ్చింది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పై అదనపు షరతులపై తీర్పు వచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చంద్రబాబు రాజకీయ ర్యాలీలు చేయకూడదు. కేసుకు సంబంధించి ఎక్కడా మాట్లాడకూడదు. అయితే డీఎస్పీల పర్యవేక్షణ మాత్రం అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
అదనపు షరతులు...
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను అనారోగ్య కారణాలతో హైకోర్టు ఇటీవల మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సీఐడీ కొన్ని షరతులను విధించాలని న్యాయస్థానాన్ని కోరింది. దీనిపై సీఐడీ వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును తన తీర్పును ప్రకటించింది. రాజకీయ ప్రసంగాలు, ర్యాలీలు చేయకూడదన్న సీఐడీ వాదనను అంగీకరించింది. అదే సమయంలో డీఎస్పీల పర్యవేక్షణ అవసరమన్న సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
Next Story

