జగన్ పాలనపై టీడీపీ ఛార్జి షీట్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంద రోజుల పాలనపై తెలుగుదేశం పార్టీ ఛార్జి షీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జగన్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంద రోజుల పాలనపై తెలుగుదేశం పార్టీ ఛార్జి షీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జగన్ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంద రోజుల పాలనపై తెలుగుదేశం పార్టీ ఛార్జి షీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జగన్ పాలనపై ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకునేందుకే జగన్ వంద రోజుల సమయాన్ని వినియోగించారన్నారు. అధికారంలోకి వచ్చినా వైసీపీ నెగిటివ్ రోల్ ను పోషిస్తుందన్నారు. అమరావతి పనులు ఆపేశారని, పోలవరం ప్రాజెక్టు పనులు తాము 70 శాతం పూర్తి చేస్తే మిగిలిన పనులు ఎందుకు పూర్తి చేయలేదని యనమల ప్రశ్నించారు. ఏపీలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోవడంతో తెలంగాణ రాష్ట్రం పుంజుకుంటుందన్నారు. పారిశ్రామికవేత్తలు ఏపీకి రావడానికి భయపడుతున్నారని యనమల ఆరోపించారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ భయందోళనలకు గురిచేస్తున్నారన్నారు యనమల.