Wed Feb 12 2025 07:16:27 GMT+0000 (Coordinated Universal Time)
చెట్టును ఢీకొన్నాడు… జరిమానా చెల్లించాడు
వైద్య కళాశాల వద్ద హరితహారంలో భాగంగా నాటిన మొక్క ను టాటా సుమో వాహనం ఢీ కొట్టడంతో చెట్టు పడిపోయింది. దీనిని సమీపంలో ఉన్న పోలీసులు గమనించి [more]
వైద్య కళాశాల వద్ద హరితహారంలో భాగంగా నాటిన మొక్క ను టాటా సుమో వాహనం ఢీ కొట్టడంతో చెట్టు పడిపోయింది. దీనిని సమీపంలో ఉన్న పోలీసులు గమనించి [more]

వైద్య కళాశాల వద్ద హరితహారంలో భాగంగా నాటిన మొక్క ను టాటా సుమో వాహనం ఢీ కొట్టడంతో చెట్టు పడిపోయింది. దీనిని సమీపంలో ఉన్న పోలీసులు గమనించి హరితహారం అధికారి ఐలయ్య కు సమాచారం ఇవ్వడం తో అక్కడికి చేరుకున్న ఐలయ్య వాహన దారుడు రాకేష్ కి తొమ్మిది వేల ఐదు వందల జరిమానా విధించారు. హరితహారం లో భాగంగా పెంచుతున్న మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి వాటిని కాపాడుతున్నామని, వాటికీ ఎవరు హాని కలిగించినా జరిమానా చెల్లించాల్సిందే నని హెచ్చరించారు. మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేట ని హరిత సిద్దిపేట గా మార్చడమే ద్వేయంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు.
Next Story