Thu Mar 19 2026 19:20:16 GMT+0530 (India Standard Time)
ఏ ఒక్క లక్షణం ఆ రాజుగారికి లేదు
రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ఆయన మాట్లాడే భాష, వ్యవహరించే తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. వైసీపీ ఎంపీగా ఆయన గెలిచారంటే [more]
రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ఆయన మాట్లాడే భాష, వ్యవహరించే తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. వైసీపీ ఎంపీగా ఆయన గెలిచారంటే [more]

రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ఆయన మాట్లాడే భాష, వ్యవహరించే తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. వైసీపీ ఎంపీగా ఆయన గెలిచారంటే జగన్ పెట్టిన బిక్ష అని ఆయన గుర్తుంచుకోవాలని తానేటి వనిత అన్నారు. వైసీపీ గుర్తు మీద గెలిచి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటమేంటని తానేటి వనిత ప్రశ్నించారు. ప్రజలకోసం ఆయన చేసిందేమీ లేదని, ఆయన అరెస్ట్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తానేటి వనిత అభిప్రాయపడ్డారు. ఆయన ఒక ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు.
Next Story