Fri Jan 30 2026 23:53:43 GMT+0000 (Coordinated Universal Time)
బాబు వెంట ఉన్నవారిపై క్రిమినల్ చర్యలు
నిన్న శాసనసభ ఆవరణలో జరిగిన సంఘటనలో ప్రమేయం ఉందన్న వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సభలో తీర్మానం చేసి స్పీకర్ [more]
నిన్న శాసనసభ ఆవరణలో జరిగిన సంఘటనలో ప్రమేయం ఉందన్న వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సభలో తీర్మానం చేసి స్పీకర్ [more]

నిన్న శాసనసభ ఆవరణలో జరిగిన సంఘటనలో ప్రమేయం ఉందన్న వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సభలో తీర్మానం చేసి స్పీకర్ ముందు ఉంచారు. అయితే నిన్న అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశించబోయిన బయట వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. నిన్న టీడీపీ నేతలతో పాటు బయట వాళ్లు కూడా కొందరు అసెంబ్లీ ఆవరణలోక ప్రవేశించారని, లోనికి వచ్చేందుకు ప్రయత్నించారని కొందరు సభ్యులు వీడియోను చూసి ఆరోపించారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా, బయట వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలని స్పీకర్ తమ్మినేని సీతారాం డీజీపీని ఆదేశించారు.
Next Story