Sat Jan 31 2026 09:54:14 GMT+0000 (Coordinated Universal Time)
అందుకే నేను 16 ఏళ్లు ఎన్నిక కాలేదు.. స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 16 ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా ఎన్నిక కాలేదన్నారు. అందుకు కారణం గతంలో ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని [more]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 16 ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా ఎన్నిక కాలేదన్నారు. అందుకు కారణం గతంలో ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని [more]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 16 ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా ఎన్నిక కాలేదన్నారు. అందుకు కారణం గతంలో ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని కూలదోస్తున్నప్పుడు ఆయనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడమేనని స్పీకర్ తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. ఆ పాపంలో తాను భాగస్వామిని అయ్యానని తమ్మినేని సీతారాం బాధపడ్డారు. ఆ పాపంలో భాగస్వామిని అయినందుకే తాను 16 ఏళ్ల పాటు ఎన్నిక కాలేదని తెలిపారు. వల్లభనేని వంశీకి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు తమ్మినేని సీతారాం ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story