Fri Mar 20 2026 13:52:16 GMT+0530 (India Standard Time)
కోపంతో వెళ్లిపోయిన తమ్మినేని
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా కేంద్రాలు, అమ్మవడి వంటి అంశాలపై చర్చ చేపడుతున్న సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. జై అమరావతి సేవ్ అమరావతి [more]
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా కేంద్రాలు, అమ్మవడి వంటి అంశాలపై చర్చ చేపడుతున్న సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. జై అమరావతి సేవ్ అమరావతి [more]

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా కేంద్రాలు, అమ్మవడి వంటి అంశాలపై చర్చ చేపడుతున్న సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. జై అమరావతి సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను సజావుగా జరగనివ్వాలని సభ్యులను పదే పదే కోరారు. అయినా టీడీపీ సభ్యులు వినకపోవడతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన తో తాను మనస్తాపానికి గురవుతున్నానని చెప్పి స్పీకర్ తమ్మినేని సీతారాం సభ నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయారు.
Next Story