Sat Jan 31 2026 09:48:18 GMT+0000 (Coordinated Universal Time)
తాజ్ కృష్ణలో బళ్లారి శాస్త్రి...కాంగ్రెస్ లో కలవరం

ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇప్పటికే ముప్పతిప్పలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం సాయంత్రం బళ్లారి నుంచి వచ్చిన శాస్త్రి అనే వ్యక్తి కలవరానికి గురిచేశాడు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో ఎమ్మెల్యేలు ఉండగా, ఓ వ్యక్తి కొంత మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేశాడు. తాను బార్ రూంలో ఉన్నానని ఒకసారి, సెల్లార్ లో ఉన్నానని మరోసారి ఎమ్మెల్యేలను పిలిచాడు. తనకు తాను బళ్లారి నుంచి వచ్చిన శాస్త్రిగా పరిచయం చేసుకున్నాడు. దీంతో వెంటనే ఎమ్మెల్యేలకు భద్రతగా ఉన్న నగరానికి చెందిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తమై హోటల్ మొత్తం ఆ శాస్త్రి కోసం వెతికినా దొరకలేదు. అయితే, ఆ వ్యక్తి ఎప్పుడు హోటల్లో దిగాడు, ఎవరెవరిని కలిశాడు అనేది ఇప్పుడు కాంగ్రెస్ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.
Next Story

