Sat Mar 21 2026 05:43:23 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కమిటీ

ముందస్తు ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణకు చెందిన 40 మంది ముఖ్యనేతలతో శుక్రవారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. అభ్యర్థుల ఎంపికకు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా భక్త చరణ్ దాస్, సభ్యులుగా జ్యోతిమణి సెన్నిమలై, శర్మిష్ఠ ముఖర్జీ నియమితులయ్యారు. షర్మిష్ఠ ముఖర్జీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు. ఈ కమిటీ సభ్యులు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తును ప్రారంభించనున్నారు.
Next Story

