Sat Mar 21 2026 00:40:40 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు మాతో కలిశారు..!

తెలంగాణలో పొత్తులపై మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ కు పొత్తు కుదిరిందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమతో జత కలిశారని, ఎన్నికల్లో తమకు సహకరించడానికి మందుకొచ్చారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారని, అందరూ గెలుపు గుర్రాలే అని పేర్కొన్నారు. కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటే ఇంటికిపోయే ముఖ్యమంత్రేనని ఎద్దేవా చేశారు.
Next Story

