Tue Mar 24 2026 05:08:15 GMT+0530 (India Standard Time)
లగడపాటి లుక్స్ ఇక్కడ పడ్డాయా..?

సోషల్ మీడియాలో తన పేరుతో వస్తున్న సర్వేలతో తనకు సంబంధం లేద, పార్టీలు కోరితే ముందే సర్వే చేసి చెబుతానని మాజీ ఎంసీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. డిసెంబర్ 7న ఎన్నికల తర్వాత సర్వే ఫలితాలు వెల్లడిస్తానన్నారు. కాంగ్రెస్ - టీడీపీ పోత్తు సక్సెస్ అవుతుందా లేదా అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. అవకాశం వస్తే తెలంగాణలో పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. జగన్ పై దాడిని ఖండించిన ఆయన భౌతిక దాడులు చేయడం సరికాదన్నారు. లగడపాటి వ్యాఖ్యలను చూస్తే ఆయ తిరిగి రాజకీయాల్లోకి వస్తారని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఆయన తాను అవకాశం వస్తే తెలంగాణ నుంచి పోటీ చేస్తాననడమే ఎవరికీ అర్థం కాని విషయం. తెలంగాణ ఎన్నికలు ఇక ఎంతో దూరంలో లేవు. ఇప్పుడు ఆయన పోటీ చేేసే అవకాశం లేదు. మరోవైపు జగన్ పై దాడి ఘటనను కూడా లగడపాటి ఖండించారు. రాజకీయాల్లో భౌతిక దాడులు సరికావన్నారు.
Next Story

