Fri Dec 05 2025 19:57:08 GMT+0000 (Coordinated Universal Time)
ఉత్తమ్ తప్పుకోవాలి లేదా తప్పిస్తాం
పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమ్యారని, ఆ పదవి నుంచి ఆయన స్వచ్ఛందంగా తప్పుకోవాలని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఉత్తమ్ [more]
పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమ్యారని, ఆ పదవి నుంచి ఆయన స్వచ్ఛందంగా తప్పుకోవాలని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఉత్తమ్ [more]

పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమ్యారని, ఆ పదవి నుంచి ఆయన స్వచ్ఛందంగా తప్పుకోవాలని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. సీఎల్పీ నేత పదవి కోసం ఉత్తమ్ పాకులాడారని, అయితే ఎమ్మెల్యేలు ఎవరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదన్నారు. సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్కను ఎంపిక చేసి అధిష్ఠానం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. పీసీసీ ప్రక్షాళన చేయాలని, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే కమిటీల నియామకం జరపాలని కోరారు. తన ఓటమికి ఉత్తమ్ కమార్ రెడ్డి కుట్ర చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
Next Story