Sat Jan 31 2026 17:04:38 GMT+0000 (Coordinated Universal Time)
సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలు అసలైనవేనా..?

సర్జికల్ స్ట్రైక్స్...రెండేళ్ల క్రితం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద క్యాంపులపై భారత బలగాలు చేసిన దాడులు. రాత్రికి రాత్రే భారత బలగాలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద క్యాంపులపై దాడులు చేసి 38 మంది ఉగ్రమూకలను మట్టుబెట్టాయి. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. అయితే, సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో ప్రతిపక్షాలు ఆధారాలు అడిగినా బయటకు రాని వీడియోలు రెండేళ్ల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ వీడియోలు నిన్నటి నుంచి వైరల్ గా మారాయి. పలు జాతీయ మీడియా చానళ్లు కూడా ఈ వీడియోలను ప్రసారం చేశాయి. డ్రోన్లతో ఉగ్రవాద క్యాంపులపై దాడులు చేయడం వీడియోలో స్పష్టంగా కనపడుతోంది. అయితే, ఈ వీడియోలు ఫేక్ కాదని, నిజమైనవేనని అప్పుడు దాడులకు సారథ్యం వహించిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా స్పష్టం చేశారు.
Next Story

