Tue Mar 24 2026 12:10:14 GMT+0530 (India Standard Time)
హైకోర్టు విభజనపై కీలక ఉత్తర్వులు

ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసేసింది. జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభం అవుతుందని కోర్టు తెలిపింది. హైకోర్టు కోసం డిసెంబర్ 15 లోపు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తవుతుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో జనవరి 1 నాటికి అమరావతిలో కొత్త హైకోర్టు ఏర్పాటవుతుందని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, మౌళిక సదుపాయాల కల్పన పూర్తయ్యాకే హైకోర్టు విభజన పూర్తవుతుందని కోర్టు స్పష్టం చేసింది.
Next Story

