Sun Mar 15 2026 21:51:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం… మోడీకి షాక్
సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మూడు వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బేనని చెప్పకతప్పదు. దీనిపై అధ్యయనం చేయడానికి నలుగురి సభ్యులతో [more]
సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మూడు వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బేనని చెప్పకతప్పదు. దీనిపై అధ్యయనం చేయడానికి నలుగురి సభ్యులతో [more]

సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మూడు వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బేనని చెప్పకతప్పదు. దీనిపై అధ్యయనం చేయడానికి నలుగురి సభ్యులతో ఒక కమిటీని నియమించనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల అభిప్రాయాలను సేకరించి సుప్రీంకోర్టుకు నివేదిస్తుంది. గత నెలన్నర రోజుల నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిది సార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మూడు వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధించింది.
Next Story